బంగాళదుంపను ను ఉడికించి మెత్తగా చేత్తోనే మెదపండి. దాన్ని కూరలో కలపండి. కొన్నిసార్లు పచ్చి బంగాళదుంప ముక్కలను వేసినా కూడా ఉప్పును పీల్చేస్తుంది.
కొబ్బరి పాలు ఉప్పును తగ్గించడంలో ఉపయోగపడతాయి. పచ్చి కొబ్బరి తురిమి పాలు తీసి కూరలో కలిపితే ఉప్పు తగ్గిపోతుంది.
వేపుళ్లలో ఉప్పు ఎక్కువైతే కొద్దిగా పంచదార వేయొచ్చు. ఈ చిట్కా అన్ని రకాల కూరలకు పనిచేయదు. కొన్నింటికి పనిచేస్తుంది.
కూరల్లో ఉప్పు ఎక్కువైతే గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకుని కూరలో వేయండి. కూర ఉడికిన తర్వాత ఆ ఉండలను తీసి బయటపడేయాలి.
మజ్జిగ పులుసు, పనీర్ వంటి కూరల్లో ఉప్పు ఎక్కువైతే, కొంచెం పెరుగు కలిపితే రుచి చెడిపోకుండా ఉంటుంది. ఉప్పు కూడా బ్యాలెన్స్ అవుతుంది.
జీడిపప్పులను నీళ్లలో నానబెట్టి ఒక టేబుల్ స్పూన్ పెరుగుతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను కూరలో కలిపితే ఉప్పుదనం చాలా వరకు తగ్గిపోతుంది.
ఉప్పును ఆరోగ్యపరంగా చూసినా అధికంగా తినకూడదు. ఇది అనేక రకాల రోగాలకు కారణం అవుతుంది.
Green Tea: రోజూ ఓ కప్పు గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది?
Earrings: 2 గ్రాముల్లో ఆఫీసుకు వెళ్లే మహిళలకు డైలీవేర్ ఇయర్ రింగ్స్
Dark Neck: మెడ నలుపును తగ్గించే 7 అద్భుతమైన చిట్కాలు
Kitchen Tips: మురికి పట్టిన కిచెన్ టవల్స్ ఎలా శుభ్రం చేయాలో తెలుసా?