కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలపై బాగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
పెరుగును మాడుకు పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయాలి.
వేపాకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ నీళ్లు చల్లారిన తర్వాత తలస్నానానికి ఉపయోగించాలి.
టీ ట్రీ ఆయిల్‌ను తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది.
ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి తలకు పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు ఉదయం దువ్వాలి. ఇది స్కాల్ప్ కి చల్లదనాన్ని అందించి, చుండ్రును తగ్గిస్తుంది.
గుడ్డు చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. గుడ్డును బాగా కలిపి మాడుకు పట్టించాలి. 15–20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
చుండ్రును వదిలించుకోవడానికి వారానికి ఒకసారి ఆముదం నూనెను ఉపయోగించవచ్చు. ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కలబంద గుజ్జు తల చర్మానికి చాలా మంచిది. ఇది జుట్టుకు తేమను అందిస్తుంది. కలబందలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును నివారిస్తాయి.
Gold Nose Pin: పొడవాటి ముఖానికి నప్పే గోల్డ్ ముక్కుపుడకలు
Pearl Earrings: 2గ్రాముల్లో ముత్యాల ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్
Kundan Maang Tikka: ట్రెండింగ్ కుందన్ పాపిడి బిళ్లలు..ఓ లుక్కేయండి
Japanese Makeup: మార్కెట్లో కొత్త ట్రెండ్..ఇగారీ మేకప్‌తో నేచురల్ లుక్