మేకప్ ట్రెండ్స్ మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని మేకప్ ఐడియాస్ సింప్లిసిటీ, నేచురల్ లుక్ ఇస్తుంది. అలాంటిదే ఈ జపనీస్ 'ఇగారి మేకప్'. ఇప్పుడిది బాగా పాపులర్ అవుతోంది.
జపాన్‌కు చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ షినోబు ఇగారి (Shinobu Igari) ఈ మేకప్ స్టైల్ ప్రారంభించారు. దీన్నే 'హ్యాంగోవర్ మేకప్ లుక్' అని పిలుస్తారు.
ఈ మేకప్ స్టైల్‌లో హెవీ ఫౌండేషన్‌తో వేయరు. నేచురల్ లుక్‍నే హైలైట్ చేయడంపైనే ఫోకస్ పెడతారు. సాఫ్ట్ బ్లష్, గ్లోయింగ్ స్కిన్, అమాయకంగా కనిపించే పెద్ద కళ్లు ఈ లుక్ ప్రత్యేకత.
దీనిలో అసలైన సీక్రెట్ బ్లష్ అప్లై విధానంలోనే ఉంది. బ్లష్‌ను బుగ్గల ఎముకల (Cheekbones) మీద కాకుండా, కళ్ల కింద నుంచి బుగ్గల వరకు నైస్‍గా బ్లెండ్ చేస్తారు. ఫేస్ లుక్కే మారిపోతుంది.
క్రీమ్ లేదా లిక్విడ్ బ్లష్‌లు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ఎందుకంటే ఇవి చర్మంలో సులభంగా కలిసిపోయి నాచురల్ లుక్ ఇస్తాయి. పింక్, పీచ్, కోరల్, రోజ్ టోన్స్ ఈ మేకప్‌కు చాలా బాగుంటాయి.
హెవీ ఫౌండేషన్‌కు బదులు లైట్ డ్యూయీ బేస్ బెటర్. కళ్లపై బేజ్, బ్రౌన్ లేదా లైట్ పింక్ ఐషాడో వాడండి. ఒక కోట్ మస్కారా చాలు. లిప్స్ పై సాఫ్ట్ లిప్ టింట్ రాసి, బయటి వైపుకు బ్లెండ్ చేయాలి.