Telugu

Floor Cleaning: ఫ్లోర్ పై మొండి మరకలు వదలడం లేదా? ఈ ఒక్క చిట్కా చాలు

Telugu

ఊడ్చి, తర్వాత తుడవాలి..

ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ముందుగా చీపురుతో ఊడవాలి. తర్వాత తడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే దుమ్ము, ధూళి మళ్లీ ఫ్లోర్ పై చేరకుండా ఉంటుంది. 

Image credits: Freepik
Telugu

చల్లటి నీళ్లు అస్సలు వద్దు

ఫ్లోర్ తుడవడానికి చల్లటి నీళ్లకు బదులుగా వేడి నీళ్లు వాడటం చాలా మంచిది. వేడి నీళ్ల వల్ల జిడ్డు, మరకలు, బ్యాక్టీరియా సులభంగా పోతాయి.
Image credits: freepik
Telugu

నిమ్మరసంతో మరకలు మాయం

ఫ్లోర్‌పై పసుపు రంగు మరకలు లేదా తుప్పు మరకలు పడితే, వాటిపై కొద్దిగా నిమ్మరసం వేసి బాగా రుద్దాలి. ఇలా చేస్తే మరకలు సులభంగా పోతాయి.
Image credits: pixabay
Telugu

బేకింగ్ సోడాతో మొండి మరకలకు చెక్

ఫ్లోర్‌పై ఉన్న మొండి మరకలను తొలగించడానికి, బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను మరకలపై రాసి, ఓ ఐదు నిమిషాల తర్వాత తడిగుడ్డతో తుడిచేయాలి.
Image credits: Getty
Telugu

వెనిగర్‌తో శుభ్రంగా..

నీళ్లలో కొద్దిగా వెనిగర్ కలిపి ఫ్లోర్ తుడవాలి. మార్బుల్, గ్రానైట్ ఫ్లోర్లకు వెనిగర్  వాడకూడదు. సాధారణ క్లాత్ కి బదులు మైక్రోఫైబర్ మాప్‌లు వాడితే దుమ్మును త్వరగా పీల్చుకుంటాయి.

Image credits: freeepik
Telugu

టైల్స్ ఫ్లోర్ అయితే ఇలా చేయండి

టైల్స్ మధ్య గ్యాప్‌లో మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. కాబట్టి, పాత టూత్‌బ్రష్‌తో ఆ గ్యాప్స్‌లో రుద్ది శుభ్రం చేయాలి. ఇల్లు తుడిచిన తర్వాత ఫ్యాన్ వేస్తే, ఫ్లోర్ త్వరగా ఆరిపోతుంది.
Image credits: Getty
Telugu

మార్బుల్, గ్రానైట్ ఫ్లోర్స్‌పై జాగ్రత్త

మార్బుల్, గ్రానైట్ ఫ్లోర్ల మీద యాసిడ్ గుణాలున్న పదార్థాలు (నిమ్మరసం, వెనిగర్) అస్సలు వాడొద్దు. వీటికి మైల్డ్ లిక్విడ్ సోప్, నీళ్లు కలిపి వాడితే సరిపోతుంది.
Image credits: instagram
Telugu

వుడెన్ ఫ్లోరింగ్ ఉంటే..

మీ ఇంట్లో వుడెన్ ఫ్లోరింగ్ ఉంటే, దానిపై నేరుగా నీళ్లు పోయకూడదు. గుడ్డను నీళ్లలో ముంచి, పూర్తిగా పిండిన తర్వాతే తుడవాలి. లేదంటే ఫ్లోర్ పాడవుతుంది.
Image credits: Getty

Coriander at Home: కొత్తిమీర కుండీలో 10 రోజుల్లో పెంచే సీక్రెట్ ఇదిగో

Maang Tikka: పిల్లల కోసం క్యూట్ పాపిట బిళ్లలు

Passion Fruit: ప్యాషన్ ఫ్రూట్ ఇంట్లో పెంచాలా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

Buttermilk: మధ్యాహ్న భోజనం తర్వాత మజ్జిగ తాగితే ఏమౌతుంది?