ప్యాషన్ ఫ్రూట్‌ను ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకోవచ్చు. దీనికోసం ఏ ఏ దశలు పాటించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
పసుపు, ఊదా రంగు లేదా 'కావేరి' వంటి హైబ్రిడ్ రకాల నుంచి మీ వాతావరణానికి సరిపోయేదాన్ని ఎంచుకోవాలి.
ప్యాషన్ ఫ్రూట్ మొక్క బాగా పెరగాలంటే, రోజూ కనీసం 6-8 గంటల సూర్యరశ్మి తగిలే ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
60 సెంటీమీటర్ల లోతు, వెడల్పు ఉన్న గుంత తవ్వి, దానిని పైమట్టి, సేంద్రియ ఎరువులతో నింపాలి.
స్థలం తక్కువగా ఉన్నవాళ్లు పెద్ద డ్రమ్ముల్లో లేదా 25 కిలోల గ్రోబ్యాగుల్లో ప్యాషన్ ఫ్రూట్‌ను పెంచుకోవచ్చు.
ఇది తీగజాతి మొక్క కాబట్టి, పాకడానికి వీలుగా వైర్ లేదా నైలాన్ వలతో బలమైన పందిరిని ఏర్పాటు చేయాలి.
మొక్క మొదట్లో ఎప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి. కానీ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తపడాలి.
ఆవు పేడ, మీట్ బోన్స్ పొడి, వేరుశనగ పిండి వంటివి సరైన సమయంలో వేస్తే మొక్క వేగంగా పెరుగుతుంది.
పంట కోత తర్వాత ఎండిన తీగలను కత్తిరిస్తే, కొత్త కొమ్మలు వచ్చి పూత బాగా పూస్తుంది.
కాయలు వచ్చేటప్పుడు పండు ఈగల బెడదను నివారించడానికి ఫెరోమోన్ ట్రాప్స్ లేదా చిన్న కవర్లను ఉపయోగించవచ్చు.
కాయలు తక్కువగా కాస్తుంటే, సాయంత్రం పూట పువ్వులలో కృత్రిమ పరాగసంపర్కం (Artificial pollination) చేయడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది.
Money Plant:మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఈ నీళ్లు పోసినా చాలు
Indoor Plants: బల్లుల్ని తరిమికొట్టే 7 మొక్కలు.. ఇంట్లో ఇవి ఉంటే చాలు, ఆ వాసనకే పరార్!
Compost Making: రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారీ!
Okra Farming: ఈ ఒక్క దాంతో ఇంట్లోనే బెండకాయ తోటే వేసేయొచ్చు