కొత్తిమీర కుండీలో 10 రోజుల్లో పెంచే సీక్రెట్ ఇదిగో
life Mar 26 2026
Author: Haritha Chappa Image Credits:Instagram
Telugu
విత్తనాలు రెడీ చేసుకోండి
ఇంట్లో ఉన్న ధనియాలను తీసుకుని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టాలి.
Image credits: Instagram
Telugu
రాత్రంతా నీటిలో నానబెట్టాలి
ధనియాలను చేతిలో వేసి మెల్లగా వేళ్లతో నొక్కి రెండు బద్దలుగా చేయాలి. అలాగే పొడి చేసుకోకూడదు. ఈ విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఇలా చేస్తే మొక్క త్వరగా మొలకెత్తే అవకాశం ఉంది.
Image credits: Instagram
Telugu
మట్టి, కుండీ ఎంపిక
సాధారణ మట్టినే తీసుకుని అందులో కొద్దిగా ఎరువు కలపాలి. నీళ్లు బయటకు పోవడానికి రంధ్రాలున్న పాత ప్లాస్టిక్ టబ్ లేదా కుండీని తీసుకోవాలి.
Image credits: Instagram
Telugu
విత్తనాలు చల్లడం
కుండీలో మట్టి నింపి, దానిపై నానబెట్టిన ధనియాల బద్దలను చల్లాలి. ఆ విత్తనాలపై పలుచగా మట్టి పొరను వేసి కప్పాలి.
Image credits: Instagram
Telugu
నీరు, వెలుతురు
విత్తనాలు వేసిన తర్వాత దానిపై కొద్దిగా నీళ్లు చిలకరించాలి. దీన్ని ఎండ తగిలే చోట పెట్టాలి. మట్టి పొడిగా మారినప్పుడు మాత్రమే నీటిని స్ప్రే చేయాలి.
Image credits: Instagram
Telugu
10 రోజుల్లో మొలకలు
విత్తనాలను మరీ లోతుగా నాటకండి. విత్తనాలు చల్లి, దానిపై కొద్దిగా మట్టి వేస్తే చాలు. కేవలం 10 రోజుల్లోనే మొలకలు రావడం మొదలవుతాయి.
Image credits: Instagram
Telugu
నెల రోజుల్లో వంటకు రెడీ
కేవలం నెల రోజుల్లోనే కుండీలో పచ్చని కొత్తిమీర పెరిగి కోతకు సిద్ధంగా ఉంటుంది. తాజాగా దీన్ని అప్పటికప్పుడు వండుకోవచ్చు.