అగరుబత్తీలను ప్యాకెట్ నుంచి తీసి బయటపెడితే, గాలి తగిలి వాటిలోని సుగంధ తైలాలు ఆవిరైపోతాయి. దీంతో వాటి వాసన తగ్గిపోతుంది.
life Apr 01 2026
Author: Nandini Arava Image Credits:Asianet News
Telugu
పొగ వస్తుంది కానీ.. వాసన రాదు
చాలాసార్లు అగరుబత్తి వెలిగించినప్పుడు పొగ మాత్రమే వస్తుంది కానీ, మంచి వాసన రాదు. అలా జరగకూడదంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.
Image credits: Pinterst
Telugu
టిష్యూ పేపర్‌తో ఇలా చుట్టండి
అగరుబత్తీలను నేరుగా డబ్బాలో పెట్టే బదులు, ముందుగా ఒక టిష్యూ పేపర్‌లో చుట్టండి. టిష్యూ పేపర్ వాటిలోని సుగంధ తైలాలను పట్టి ఉంచి, బయటి తేమ తగలకుండా కాపాడుతుంది.
Image credits: Freepik
Telugu
గాలి చొరబడని డబ్బాలో పెట్టండి
టిష్యూ పేపర్‌లో చుట్టిన అగరుబత్తీలను గాలి చొరబడని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో పెట్టి మూత గట్టిగా పెట్టండి. ఇలా చేస్తే నెలల తర్వాత వెలిగించినా, కొన్నప్పటిలాగే మంచి వాసన వస్తుంది.
Image credits: Our own
Telugu
ఎండ తగలకుండా చూడండి
అగరుబత్తీల డబ్బాను ఎప్పుడూ చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలోనే పెట్టాలి. ఎండ లేదా వేడి తగిలితే వాటి సహజ సువాసన త్వరగా పోతుంది.