Telugu

తేనె డబ్బాకు చీమలు పట్టకుండా చిన్న చిట్కా ఇదిగో

Telugu

మిరియాల చిట్కా

చీమలకు మిరియాల వాసన నచ్చదు.  తేనె డబ్బాలో ఓ 4-5 మిరియాలు వేయండి. వాటి ఘాటైన వాసన వల్ల తేనె వాసన చీమలకు చేరదు.  అవి డబ్బా దగ్గరకే రావు.

Image credits: Getty
Telugu

తేనె రుచి అస్సలు మారదు

మిరియాల పొడి వాడకండి.  గింజలనే వాడాలి.  అప్పుడు అవి తేనెలో కలవవు. దీనివల్ల తేనె అసలు రుచి, నాణ్యత ఏమాత్రం మారకుండా ఉంటాయి. తినేముందుకు గింజలను తీసేయచ్చు.

Image credits: Our own
Telugu

చాలా కాలం పనిచేస్తుంది

ఒక్కసారి మిరియాలు వేశారంటే చాలు. అవి చాలా కాలం పాటు తమ వాసనను కోల్పోవు. అందుకే వాటిని పదేపదే మార్చాల్సిన అవసరం ఉండదు.

Image credits: Getty
Telugu

లవంగాలతోనూ ప్రయోజనం

మిరియాలు లేకపోతే లవంగాలు వాడవచ్చు. రెండు మూడు లవంగాలను వేస్తే సరిపోతుంది.  లవంగాల వాసన కూడా చీమలకు అస్సలు పడదు.

Image credits: Getty
Telugu

డబ్బా అంచులు

తేనె వాడిన తర్వాత డబ్బా మూతికి, అంచులకు తేనె చుక్కలను లేకుండా తడి గుడ్డతో తుడిచేయాలి. ఇలా చేస్తే చీమలు త్వరగా చేరవు.

Image credits: Getty
Telugu

పసుపు పొడితోనూ..

తేనె డబ్బాను పెట్టే చోట దాని చుట్టూ కొద్దిగా పసుపు పొడి చల్లినా మంచిదే.  చీమలకు పసుపు పొడి కూడా నచ్చదు. 

Image credits: Getty
Telugu

తేనె చెడిపోదు

ప్రపంచంలో చెడిపోని ఆహారం తేనె ఒక్కటే. కానీ చీమలు పట్టేస్తే మాత్రం తినడం కష్టం. కాబట్టి పైన చిట్కాలు పాటిస్తే మంచిది.

Image credits: Getty

Dry Lips: పెదాలు పొడిబారి పగులుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే సరి

Black Beads: ఆఫీసుకువెళ్లే మహిళలకు ఫర్ఫెక్ట్ నల్లపూసల గొలుసు

Gold Earrings: సింపుల్ సింగిల్ చైన్ ఇయర్ రింగ్స్- పెట్టుకుంటే అదుర్స్!

Purple Anklets: పర్పుల్ కలర్ లో మువ్వల పట్టీలు.. ఎంత క్యూట్ ఉన్నాయో