Lifestyle
మీరు గర్భం దాల్చితే రకరకాల ఆహారాలను తినాలనిపిస్తుంది. అలాగే కొన్ని ఫుడ్ వాసనలు, రుచుల పట్ల విరక్తి వస్తుంది. ఇలాంటివి తిన్నా, వాసన చూసినా వికారంగా అనిపిస్తుంది.
గర్భిణుల శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు వస్తాయి. అలాగే మూత్రపిండాలకు రక్త ప్రసరణ పెరగడం వీరు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
మీరు గర్భం దాల్చితే మీ పీరియడ్స్ మిస్ అవుతుంది. మీరు మీ పీరియడ్స్ ను మిస్ కావడం గర్భం ప్రారంభ సంకేతం కావొచ్చు.
గర్భిణుల శరీరంలో హార్మోన్లలో హెచ్చు తగ్గులు రావడం చాలా సహజం. ఈ మార్పుల వల్ల మానసిక మసస్యలు వస్తాయి. చిరాకు లేదా భావోద్వేగ సున్నితత్వం వంటి సమస్యలొస్తాయి.
సాధారణం కంటే మీరు ఎక్కువగా అలసిపోతున్నారా? ఇది కూడా ప్రెగ్నెన్సీ సంకేతమేనంటున్నారు నిపుణులు. ఇది గర్భం ప్రారంభ సంకేతాల్లో ఒకటి కావొచ్చు.
గర్భం దాల్చిన మొదట్లో ఆడవారి శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తాయి. దీనివల్ల వీరి రొమ్ముల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో రొమ్ముల పరిమాణం పెరుగుతుంది.
కొంతమంది గర్భిణులకు వికారంగా ఎప్పుడూ వికారంగా అనిపిస్తుంది. గర్భం దాల్చిన మొదటి నుంచి వాంతులు అవుతుంటాయి. కొంతమంది ఉదయం మాత్రమే అయితే ఇంకొంతమందికి రోజంతా అవుతూనే ఉంటాయి.