Lifestyle

చుండ్రును తగ్గించే చిట్కాలు

చుండ్రు ఒక సాధారణ జుట్టు సమస్య. కానీ ఇది జుట్టు విపరీతంగా రాలేలా చేస్తుంది. అయితే కొన్ని సహజ చిట్కాలతో కూడా మీరు చుండ్రును తగ్గించుకోవచ్చు. ఎలాగంటే? 
 

Image credits: Freepik

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం జుట్టును తడిపి కొంచెం బేకింగ్ సోడాను నెత్తిమీద రుద్దండి. 
 

Image credits: Freepik

వేప

వేప ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తొలగించడానికి ఎంతో సహాయపడతాయి.  వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి వడకట్టి, షాంపూ చేసి నెత్తికి అప్లై చేయండి. 
 

Image credits: Freepik

నిమ్మరసం

నిమ్మరసంలోని ఆమ్లత్వం స్కాల్ప్ pHని సమతుల్యం చేస్తుంది. అలాగే చుండ్రును తగ్గిస్తుంది. ఇందుకోసం తాజా నిమ్మరసంలో కొన్ని నీటిని కలిగిపి తలకు అప్లై చేయండి. 5-10 నిమిషాల తర్వాత కడగండి. 
 

Image credits: Freepik

టీ ట్రీ ఆయిల్

చుండ్రును పోగొట్టడానికి మీ షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్‌ని కలిపి వాడండి. అయితే కొంతమందికి టీ ట్రీ ఆయిల్‌ పడకపోవచ్చు. అందుకే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయండి.
 

Image credits: Freepik

కొబ్బరి నూనే

కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. గోరువెచ్చని కొబ్బరి నూనెను మీ తలకు మసాజ్ చేసి ఒక గంట తర్వాత జుట్టును వాష్ చేయండి. చుండ్రు పోతుంది.
 

Image credits: Freepik

ఆపిల్ సైడర్ వెనిగర్

ACVలో ఉండే సహజ యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించడానికి సహాయపడతాయి. సమాన పరిమాణంలో నీటిని, ACVని కలపి వాడాలి. 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. 
 

Image credits: Freepik

కలబంద

 

కలబందలో ఓదార్పు మరియు శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. తాజా కలబంద జెల్‌ను మీ తలకు అప్లై చేసి, 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత బాగా కడిగేయండి.
 

Image credits: Freepik

మొక్కజొన్నలంటే ఇష్టమా? అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

వినాయక చవితికి తప్పనిసరిగా చేయాల్సిన వంటకాలు ఇవి..

రోజుకు ఒకసారి పెరుగు తిన్నా.. ఈ సమస్యలన్నీ దూరం..

మీరు కాలీఫ్లవర్ ను తినరా? ఈ లాభాలను మిస్సైనట్టే మరి..!