Lifestyle

సోంపు గింజలు

సోంపు మన ఆరోగ్యానికే కాదు నోటి దుర్వాసనను పోగొట్టడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే మీరు భోజనం చేసిన తర్వాత కొన్ని సోంపు గింజలను నమలండి. 
 

Image credits: others

యాలకులు

యాలకులు కూడా నోటి నుంచి చెడు వాసన రాకుండా చేస్తాయి. ఇందుకోసం భోజనం తర్వాత ఒకటి లేదా రెండు యాలకులను నోటిలో వేసుకుని నమలండి. 
 

Image credits: Getty

లవంగాలు

లవంగాల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. నోటి నుంచి చెడువాసన వస్తే మీరు భోజనం చేసిన తర్వాత లవంగాలను నమలండి. లవంగాల్లోని యాంటీసెప్టిక్ గుణాలు నోటి దుర్వాస కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి
 

Image credits: others

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. నోటి దుర్వాసను పోగొట్టడానికి దాల్చిన చెక్క నీటితో నోటిని కడుక్కోవాలి. 
 

Image credits: Getty

నిమ్మరసం

నిమ్మరసం కూడా నోటి దుర్వాసనను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి నీటిలో మౌత్ వాష్ గా వాడండి. 
 

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీ తాగితే బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యంగా ఉండటం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. 
 

 

Image credits: Getty

నీరు

నీటిని ఎంత ఎక్కువగా తాగితే మన ఆరోగ్యం అంత బేషుగ్గా ఉంటుంది. మీకు తెలుసా? రోజంతా నీటిని పుష్కలంగా తాగితే నోటి దుర్వాసన కూడా రాదు. 
 

Image credits: Getty

ఆహారపు అలవాట్లు

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మనల్ని ఆరోగ్యం, ఎలాంటి రోగం లేకుండా ఉంచుతాయి. నోటి దుర్వాసనను తగ్గించుకోవడానికి మంచి ఆహారంతో పాటుగా పండ్లను కూడా తినండి. 
 

Image credits: Getty
Find Next One