Lifestyle
ఉల్లిపాయల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మనకు అంటువ్యాధులు, ఇతర రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
మధుమేహులకు కూడా ఉల్లిపాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఉల్లిపాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
ఉల్లిపాయల్లో సల్ఫర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి.
మెదడు ఆరోగ్యానికి ఉల్లిపాయలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలను రోజూ తింటే చర్మంపై ముడతలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. అలాగే చర్మం అందంగా మెరుస్తుంది.
ఉల్లిపాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఉల్లిపాయలను తింటే బరువు కూడా తగ్గుతారిని నిపుణులు అంటున్నారు.