అన్నం ఉడికించిన తర్వాత వచ్చే గంజి నీటిని బాగా చల్లార్చండి. దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుని, ప్రతిరోజూ ముఖానికి టోనర్‌లాగా వాడుకోవచ్చు.
చర్మంలో పీహెచ్(pH) స్థాయిని కాపాడటంలో రైస్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి, మృదువుగా మార్చడంలో ఇది సాయపడుతుంది.
రైస్ వాటర్‌లో ఉండే అమైనో యాసిడ్స్ చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. చర్మానికి సాగే గుణాన్ని అందించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
ఎండ వల్ల ముఖం కమిలిపోయినా, ఎర్రబడినా రైస్ వాటర్‌తో చెక్ పెట్టొచ్చు. ముఖానికి రైస్ వాటర్ రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేస్తే సరి.
చర్మం తక్షణమే ప్రకాశవంతంగా మారేందుకు రైస్ వాటర్ ఉపయోగపడుతుంది. దీన్ని రోజూ వాడటం వల్ల స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది.
ముఖంపై ఉండే చర్మ రంధ్రాలను(పోర్స్) తగ్గించడంలో రైస్ వాటర్ బెస్ట్ ఆప్షన్. చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా ఉంచుతుంది.
తయారు చేసుకున్న రైస్ వాటర్‌ను ఫ్రిజ్‌లో పెడితే వారం రోజుల వరకు పాడవకుండా వాడుకోవచ్చు. చల్లటి రైస్ వాటర్ ముఖానికి రాసుకుంటే మరింత ఫ్రెష్‌గా ఉంటుంది.
Snake Design Ring: ట్రెండీ లుక్ ఇచ్చే స్నేక్ డిజైన్ రింగ్స్.. చూసేయండి
కేవలం 2 రూపాయలతో ముఖంపై మచ్చలు, ముడతలు మాయం
Baby Earrings: చిన్నారుల కోసం అందమైన చెవిపోగులు.. చూస్తే కొనేస్తారంతే!
Necklace Design:మెడ నిండుగా నక్లెస్ డిజైన్లు చీరల మీదకు అదిరిపోయే లుక్