సాధారణంగా కొందరిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఎంత తిన్నా ఆకలి తీరదు. కడుపునిండా తిన్నా కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుంది.
ఎంత తిన్న ఆకలి తీరకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది.
డీహైడ్రేషన్ కారణంగా కూడా తరచూ ఆకలి వేస్తుంది. కాబట్టి శరీరానికి సరిపడా నీటిని తాగడం మరిచిపోవద్దు.
రాత్రి సరిగ్గా నిద్ర పోకపోతే ఆకలిని పెంచే గ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లు శరీరంలో పెరుగుతాయి. ఇది అతిగా ఆకలికి దారితీస్తుంది.
టెన్షన్‌లో ఉన్నప్పుడు కార్టిసాల్, అడ్రినాలిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది అతిగా ఆకలికి దారితీస్తుంది.
బరువు తగ్గడానికి వ్యాయామం చేసేటప్పుడు శరీరం నుంచి ఎక్కువ కేలరీలు తగ్గుతాయి. ఇది అతిగా ఆకలికి దారితీస్తుంది.
కుకీస్, చాక్లెట్, తెల్ల బ్రెడ్ లాంటి కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం కూడా అతిగా ఆకలికి దారితీస్తుంది.
వామ్మో! రోజూ వాము తింటే ఇన్ని లాభాలా?
200ఏళ్లనాటి నగలు, చీరలో నీతా అంబానీ.. ప్రత్యేకతలెంటో తెలుసా?
చాణక్య నీతి: ఇవి ధనం కంటే విలువైనవి తెలుసా
థైరాయిడ్ ఉన్నవాళ్లు ఇవి తినొద్దు