Food
ప్రతిరోజూ కొంచెం వాము నమిలి మింగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
స్త్రీలకు నెలసరి నొప్పులు, కడుపు నొప్పి తగ్గించడానికి వాము సహాయపడుతుంది. నెలసరి సమయంలో చిటికెడు వాము నమిలి తినండి.
వాములోని ఫైటోఈస్ట్రోజెన్లు కణాల అసాధారణ మార్పులను నిరోధించి, బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారిస్తాయి.
పాలిచ్చే తల్లులు రోజూ కొంచెం వాము తినాలి. తల్లిపాల ఉత్పత్తిని పెంచడానికి వాము చాలా మంచిది.
మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నియంత్రించడానికి వాము సహాయపడుతుంది. జీర్ణక్రియను సులభతరం చేయడం ద్వారా వాము శరీరంలో జీవక్రియను పెంచుతుంది.
ఆస్తమా, సైనస్, కఫం వంటివి నియంత్రించడానికి వాము సహాయపడుతుంది. బ్రోన్కైటిస్ లేదా సైనస్ ఉన్నవారు ఆహారంలో వాము చేర్చుకోవాలి.
వాములో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీని నియంత్రించడానికి సహాయపడుతుంది.