Food
థైరాయిడ్ గ్రంధి తగినంత థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయలేని పరిస్థితినే హైపోథైరాయిడిజం సమస్య అంటారు.
అయితే ఈ హైపోథైరాయిడిజం కంట్రోల్ లో ఉండాలంటే కేవలం మందులను వాడటమే కాదు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సోయా, సోయా పాలు వంటి సోయా ఉత్పత్తుల్లో ఐసోఫ్లేవోన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి హైపోథైరాయిడిజం సమస్యను పెంచుతాయి.
థైరాయిడ్ పేషెంట్లు కెఫిన్ కంటెంట్ ఉన్న టీ, కాఫీ వంటి పానీయాలను తాగకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్ హార్మోన్ శోషణకు అడ్డుపడతాయి.
థైరాయిడ్ పేషెంట్లు క్యాబేజీ, బ్రోకలీ వంటి కూరగాయల్ని తినకూడదు. ఎందుకంటే వీటిలో గోయిట్రోజెన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి.
అలాగే థైరాయిడ్ ఉన్నవారు చిప్స్, ప్రాసెస్డ్ మాంసం కూడా తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉప్పు, నూనె, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవిమీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
థైరాయిడ్ ఉన్నవారు మందును కూడా తాగకూడదు. ఎందుకంటే ఇది థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను, థైరాయిడ్ గ్రంధి హార్మోన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.