Lifestyle
గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తినకూడదు. ఎందుకంటే వీటిలో సాల్మొనెల్లా వంటి హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఇవి బిడ్డకు హాని కలిగించొచ్చు. ఇంతకీ వేటిని తినకూడదంటే?
పచ్చి లేదా తక్కువ ఉడికించిన గుడ్లలో సాల్మొనెల్లా ఉంటుంది. ఇది ఆహార విషానికి దారి తీస్తుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గుడ్లను పూర్తిగా ఉడికించుకోవాలి.
పాశ్చరైజ్ చేయని పాలు లిస్టిరియా వంటి హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. ఇవి మీకు, మీ బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అందుకే కేవలం పాశ్చరైజ్డ్ పాలను మాత్రమే తాగండి.
పచ్చి లేదా తక్కువ ఉడికించిన షెల్ఫిష్ మిమ్మల్ని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, టాక్సిన్స్‌కు గురిచేస్తాయి. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి
బ్రోమెలైన్ ఎంజైమ్ గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. అనాసపండులో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే గర్భవతులు అనాసపండును ఎక్కువగా తినకూడదు.
ప్రాసెస్ చేసిన మాంసాహారాల్లో ఎక్కువగా సంకలితాలు, నైట్రేట్లు ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో ఎన్నో సమస్యలను కలిగిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే తాజా మాంసాలను మాత్రమే తినండి.
కాఫీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అయితే కెఫిన్ ను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాగే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది.
గర్భధారణ సమయంలో మందును తాగడం వాల్ల బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఇది పిండం ఆల్కహాల్ స్పెక్ట్రమ్ రుగ్మతలకు దారితీస్తుంది.
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సంకోచాలను ప్రేరేపిస్తుంది. అలాగే గర్భస్రావానికి దారితీస్తుంది. గర్భధారణ సమయంలో బొప్పాయిని తినకపోవడమే మంచిది.