Lifestyle

జీడిపండుతో కలిగే ప్రయోజనాలు

ఒకప్పుడు పంట పొలాల గట్టున జీడిచెట్లు కనిపించేవి. ఇప్పుడూ చెట్టు చూద్దామన్నా కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే ఈ జీడిపప్పులే కాదు జీడి పండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

Image credits: Pexels

విటమిన్స్ కు గొప్ప మూలం

జీడిపండులో విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్ శక్తి ఉత్పత్తికి, నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం.
 

Image credits: Pexels

యాంటీఆక్సిడెంట్ పవర్‌హౌస్

జీడిపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాల్ని కూడా తగ్గిస్తాయి. 

Image credits: Pexels

రోగనిరోధక వ్యవస్థ

జీడిపండులో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు, సాధారణ అనారోగ్యాలు సోకకుండా రక్షిస్తుంది. 
 

Image credits: Pexels

హార్ట్ హెల్త్

జీడిపండులో పొటాషియం, డైటరీ ఫైబర్ వంటి గుండెకు అనుకూలమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. 
 

Image credits: Pexels

జీర్ణక్రియ

జీడిపప్పులో ఉండే డైటరీ ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. 
 

Image credits: Pexels

చర్మం, జుట్టు పోషణ

జీడిపండులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.ఈ పండులోని హైడ్రేటింగ్ లక్షణాలు మీ చర్మాన్ని తేమగా, కాంతివంతంగా చేస్తాయి. 
 

Image credits: Pexels

ఎముకల ఆరోగ్యం

జీడిపండులో కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలు, మొత్తం అస్థిపంజరాన్ని బలంగా ఉంచేందుకు సహాయపడతాయి. 

Image credits: Pexels

ఉదయాన్నే పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

బ్లడ్ షుగర్ పెరిగిందని ఈ అవయవాలను బట్టి కూడా తెలుసుకోవచ్చు

నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు

బోర్ కొట్టినప్పుడు తినాల్సిన ఆహారాలు ఇవి