పెరుగు ప్రోబయోటిక్స్ కు సహజ మూలం. ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా. ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
life Aug 17 2023
Author: Mahesh Rajamoni Image Credits:Freepik
Telugu
ప్రోటీన్ కు అద్భుతమైన మూలం
పెరుగు కూడా ప్రోటీన్-రిచ్ ఫుడ్. ఇది శాఖాహారులకు, కండరాల నిర్వహణ, మరమ్మత్తు కోసం వారి ప్రోటీన్ ను తీసుకోవడం పెంచాలని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Freepik
Telugu
బరువు కంట్రోల్
పెరుగులో ఉండే ప్రొటీన్, కాల్షియం మన కడుపును తొందరగా నింపుతాయి. అంతేకాదు అనవసరమైన చిరుతిళ్లను తినకుండా చేయడానికి సహాయపడతాయి. దీంతో మీరు బరువు తగ్గుతారు.
Image credits: Freepik
Telugu
చర్మం, జుట్టు ప్రయోజనాలు
పెరుగులోని ప్రోబయోటిక్స్, పోషకాలు మన గట్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతుంది. అంతేకాదు జుట్టు కూడా బలంగా, ఒత్తుగా పెరుగుతుంది.
Image credits: Freepik
Telugu
వాపు తగ్గడం
పెరుగులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ వాపు దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంటుంది.
Image credits: Freepik
Telugu
బ్లడ్ ప్రెజర్ నియంత్రణ
పెరుగులో ఉండే పొటాషియం, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో పాత్ర పోషిస్తుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Image credits: Freepik
Telugu
మెరుగైన జీర్ణక్రియ
పెరుగులో ఉండే కొన్ని సమ్మేళనాలు లాక్టోస్‌ను విచ్ఛిన్నం చేయడానికి, పోషకాల శోషణను సహాయపడతాయి. ఇవి మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.