Lifestyle

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

పాలు, పంచదార కలిపిన టీ కంటే గ్రీన్ టీనే మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ టీ ఎన్నో రోగాలను దూరం చేస్తుంది. ఈ టీని రోజూ తాగితే ఏమౌతుందంటే? 

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గిస్తుంది

శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడానికి గ్రీన్ టీ ఎంతో సహాయపడుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కొవ్వు గుండె జబ్బులతో సహా ఎన్నో రోగాలకు దారితీస్తుంది.
 

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందిగ్రీన్ టీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

గ్రీన్ టీలో కెఫిన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది మన మెదడు పనితీరును మెరుగుపడుతుంది. ఇది మనల్ని చురుగ్గా చేస్తుంది.
 

బీపీ అదుపులో ఉంటుంది

బ్లడ్ ప్రెజర్ పెరిగినా... తగ్గినా ప్రాణాంతకమే. ఇది మన ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. అయితే రక్తపోటు హెచ్చుతగ్గులతో పోరాడటానికి గ్రీన్ టీ బాగా సహాయపడుతుంది.
 

అల్జీమర్స్ ను నివారిస్తుంది

గ్రీన్ టీలోని కాటెచిన్ సమ్మేళనాలు న్యూరాన్లను రక్షిస్తాయి. ఇది పార్కిన్సన్, అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే గుండె పోటు, స్టోక్ తో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అయితే రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
 

కాలేయాన్ని రక్షిస్తుంది

మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలెయం ఒకటి. అయితే రోజూ గ్రీన్ టీని తాగితే కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలెయ సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. 
 

ఫ్యాటీ లివర్ ను నివారిస్తుంది

ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గ్రీన్ టీ కొవ్వు కాలేయ వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని 75 శాతం తగ్గిస్తుంది.
 

Find Next One