ఆర్.మాధవన్ తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.
చాలా మంది అభిమానులను సంపాదించుకున్న ఆర్.మాధవన్ 55 ఏళ్ల వయసులో కూడా చాలా యవ్వనంగా కనపడుతున్నారు.
ఆర్.మాధవన్ ప్రతి ఆదివారం ఆవ నూనెతో స్నానం చేస్తారు.
మిగిలిన రోజుల్లో ఆర్.మాధవన్ కొబ్బరి నూనెను వాడతారు. రెండు దశాబ్దాలుగా ఈ అలవాటును కొనసాగిస్తున్నారు.
ప్రతిరోజూ ముఖంపై సూర్య కిరణాలు పడేలా చూసుకుంటారు. గోల్ఫ్ కూడా ఆడతారు.
కాస్మెటిక్ ఉత్పత్తులను ఆర్.మాధవన్ వాడరు.
ముఖానికి కూడా కొబ్బరి నూనె రాస్తారు. దీనివల్ల ముఖానికి మాయిశ్చరైజేషన్, తాజాదనం లభిస్తుంది.
ప్రతిరోజూ కొబ్బరినీరు తాగుతారు, శాఖాహారం తీసుకుంటారు.
ప్యాకెట్ ఆహారం, మసాలా ఆహారం తినరు.
ఇంట్లో వండిన దాల్, కూరగాయలు, అన్నమే తింటారు. ఆకలి వేసినప్పుడే తింటారు.