వ్యాయామం, ఆహారంతో పాటు నిద్ర కూడా అవసరం. 7-9 గంటలు విశ్రాంతి తీసుకోవాలి.
ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించవచ్చు, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.
వారంలో 2-3 సార్లు వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరుగుతుంది.
ప్రోటీన్ ఆహారం, కూరగాయలు, ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టాలి.
తినే దానికంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేయాలి.
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
రోజుకు మూడు లీటర్ల నీరు త్రాగడం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి.
చక్కెర, మైదా, నూనె, ఆల్కహాల్ కి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
వ్యాయామం, నిద్ర, ఆహారం అన్నింటిలో క్రమశిక్షణ ముఖ్యం.