ఇల్లు, పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త, ఎండిన ఆకులు పేరుకుపోకుండా చూసుకోవాలి.
ఇంటి బయట కట్టెలు పేర్చడం చాలా ఇళ్లలో ఉండే అలవాటు. కానీ ఇది పాములకు దాక్కోవడానికి అనువుగా ఉంటుంది. గోడలకు ఆనుకుని కట్టెలు పెట్టకూడదు.
వర్షాకాలంలో ఇంటి తలుపులు, కిటికీలు ఒకసారి పరిశీలించడం మంచిది. ఎక్కడైనా రంధ్రాలు ఉంటే వాటిని మూసేయడం మంచిది.
కుండీల మధ్య దూరం ఉంచాలి. చెట్లు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు పాములు రావడానికి అవకాశం ఉంది.
ఇంటి ముందు కాంక్రీట్‌లో పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. వాటి మధ్యలో పాములు దాక్కోవచ్చు.
ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి తలుపులు, కిటికీల దగ్గర పెరిగే తీగలను కత్తిరించాలి. వాటి ద్వారా పాములు ఇంట్లోకి రావచ్చు.
ఇంట్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్, గాలి రంధ్రాలకు నెట్ వేయడం వల్ల జీవులు ఇంట్లోకి రాకుండా ఆపుతుంది.