Lifestyle

ప్రపోజ్ డే

అబ్బాయిలు ఇలా ప్రపోజ్ చేయడం అమ్మాయిలకు చాలా ఇష్టం..

Image credits: Freepik

రొమాంటిక్ డేట్

ప్రపోజ్ డే నాడు మీ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలనుకుంటే ఆమెను మంచి రొమాంటిక్ ప్లేస్ కి తీసుకెళండి. ఇక్కడే మీ మనస్సులోని  మాటను చెప్పేయండి. 

Image credits: freepik

ఐ లవ్ యూ బదులుగా..

‘ఐ లవ్ యూ’ అని ఒక్క మాటలో మీ ప్రేమను చెప్పేయొచ్చు. కానీ ఇది రొటీన్ గా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీ మనసులోని భావాలను ఒక కవిత రూపంలో చెప్పండి. దీనికి అమ్మాయిలు బాగా ఇంప్రెస్ అవుతారు. 
 

Image credits: Freepik

ప్రేమ లేఖ

ఒకప్పుడు మనస్సులోని మాటలు చెప్పడానికి లవ్ లెటర్స్ నే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ లోనే అన్ని విషయాలను చెప్పేస్తున్నారు. కానీ మీ ఫీలింగ్స్ ని ప్రేమలేఖ ద్వారా తెలియజేయండి

Image credits: Freepik

మెమోరీస్

ఈ ప్రపోజ్ డే నాడు మీ భాగస్వామికి భిన్నంగా ప్రపోజ్ చేయాలనుకుంటే.. మీ దగ్గరున్న వారి పాత ఫోటోలను, ఫన్నీ చాట్లను తీసి ఒక బాక్స్ లో పెట్టి వారికి గిఫ్ట్ గా ఇచ్చి ప్రపోజ్ చేయండి. 
 

Image credits: Freepik

డిన్నర్ కు తీసుకెళ్లండి

రొమాంటిక్ డిన్నర్ కు వెళ్లాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే మీ ప్రేయసిని ప్రపోజ్ డే నాడు క్యాండిల్ లైట్ డిన్నర్ కు తీసుకెళ్లి ప్రపోజ్ చేయండి. 
 

Image credits: Freepik

కుటుంబ ప్రతిపాదన

మీరు ఎవరికైనా పెళ్లికి ప్రపోజ్ చేస్తుంటే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడమే కాదు.. కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టి మీ మనసులోని మాటను అందరికీ చెప్పి ఫ్యామిలీ ప్రపోజల్ ఇవ్వండి.
 

Image credits: Freepik

సోషల్ మీడియా

మీ గర్ల్ ఫ్రెండ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే సోషల్ మీడియాలో మంచి వీడియో క్రియేట్ చేసి ప్రపోజ్ చేయొచ్చు.

Image credits: Freepik
Find Next One