Telugu

గుడ్డు

శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుకుని చాలా మంది గుడ్లకు దూరంగా ఉంటారు. కానీ గుడ్లు మంచి పోషకమైన, ఆరోగ్యకరమైన ఆహారం.
 

Telugu

గుడ్డులోని తెల్లసొన

గుడ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. గుడ్డులోని రెండు భాగాలుంటాయి. ఒకటి తెల్లసొన, ఒకటి పచ్చసొన. 
 

Image credits: Getty
Telugu

గుడ్డులోని పచ్చసొన

గుడ్డులోని పచ్చసొనలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.   అయితే ఈ పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 

Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్

తెల్లసొన, పచ్చసొనలో సుమారుగా 411 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ గుడ్డులో కొలెస్ట్రాల్ ఉన్నందున.. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి కారణమవుతాయని చెప్పడం తప్పు.
 

Image credits: Getty
Telugu

కొలెస్ట్రాల్

కాలేయం పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది. గుడ్లు వంటి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాల పరిమాణం కాలేయం ఉత్పత్తిని తగ్గిస్తుంది.
 

Image credits: Getty
Telugu

గుడ్డు పచ్చసొన

ప్రతి రోజూ గుడ్డు పచ్చసొనను తినడం వల్ల మీ శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణంలో పెద్ద తేడా ఏమీ ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Image credits: Getty
Telugu

గుడ్డు

ప్రోటీన్, కోలిన్ తో పాటుగా గుడ్లలో ఒమేగా -3 ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. గుడ్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

Image credits: Getty

క్యాన్సర్ తో చనిపోయిన సెలబ్రిటీలు వీళ్లు..

షుగర్ పేషెంట్లు తినకూడని ఆహారాలు ఇవి..

మీరు ఆరోగ్యంగానే ఉన్నారా?

ఎవ్వరికీ తెలియని కలబంద ప్రయోజనాలు ఇవి