Telugu

ఎంతటి ఎండనైనా తట్టుకునే మొక్కలు, ఇంట్లో పెంచుకోవచ్చు

Telugu

బోగన్‌విలియా (కాగితం పువ్వుల మొక్క)

దీన్ని వేసవి మొక్కగా చెబుతారు. ఎంతటి తీవ్రమైన ఎండలోనైనా దీని రంగురంగుల పువ్వులు పూస్తూనే ఉంటాయి. దీనికి ఎక్కువ నీళ్లు అవసరం లేదు. పొడి నేలలో కూడా ఇది బాగా పెరుగుతుంది.

Image credits: gemini
Telugu

పోర్టులాకా (గడ్డి పువ్వులు)

దీన్ని 'సన్ లవర్ ప్లాంట్' అని పిలుస్తారు. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే, పువ్వులు అంత ఎక్కువగా పూస్తాయి. తక్కువ నీటితో కూడా ఇది వారాలపాటు తాజాగా ఉంటుంది.
Image credits: gemini
Telugu

స్నేక్ ప్లాంట్

తీవ్రమైన వేడి, తక్కువ నీరు, తక్కువ సంరక్షణతో  బతుకుతుంది. దీన్ని ఇండోర్, ఔట్‌డోర్.. రెండు చోట్లా సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: gemini
Telugu

ఎడెనియం

ఇది ఎడారి మొక్క కాబట్టి, తీవ్రమైన ఎండ, వేడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. దీని లావపాటి వేర్లు నీటిని నిల్వ చేసుకుంటాయి. అందుకే ఇది త్వరగా వాడిపోదు.
Image credits: gemini
Telugu

జినియా

వేసవికి ఇది బెస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌లో ఒకటి. తీవ్రమైన ఎండలో కూడా దీని ప్రకాశవంతమైన పువ్వులు పూసి ఉంటాయి. ఇవి మీ గార్డెన్‌ను రంగులమయం చేస్తాయి.

Image credits: gemini
Telugu

జేడ్ ప్లాంట్

నర్సరీల్లో కచ్చితంగా ఉండే మొక్క ఇది. దీన్ని పెంచడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. గుప్పెడు నీళ్లు రెండు రోజులకోసారి పోస్తే చాలు.

Image credits: Getty
Telugu

శంఖం పూల మొక్క

ఇది ఎక్కువగా తెలుగువారి ఇళ్లల్లో కనిపిస్తుంది. దీన్ని పెంచడం చాలా సులువు. ఇది తీగ కాబట్టి అల్లుకుపోతుంది.

Image credits: Unlimitedgreens

Rajasthani Payal: అదిరిపోయే రాజస్థానీ పట్టీల డిజైన్లు

Kids Health: పిల్లల మెమరీ పవర్ పెంచే 7 సూపర్ ఫుడ్స్ ఇవే!

Bedsheet Tips: బెడ్ మీద బెడ్ షీట్ నీట్ గా కనిపించాలా? బెస్ట్ చిట్కా

Trending Anklets: పాదాలకు కొత్త మెరుపునిచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో