Lifestyle

తాటి బెల్లం తింటే.. ఆ సమస్యలన్నీ బలదూర్‌

Image credits: Freepik

బరువు తగ్గించడంలో

బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే తాటి బెల్లాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియలను వేగవంతం చేసి శరీర బరువును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. 


 

Image credits: Getty

శ్వాస సమస్యలు

తాటి బెల్లాన్ని రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు సమస్యలకు బాగా పనిచేస్తుంది. 

Image credits: Getty

మహిళలకు

మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి, వికారం, తిమ్మిర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఇందుకు తోడ్పడుతాయి. 

Image credits: Freepik

బలమైన ఎముకలు

తాటి బెల్లంలో కాల్షియం, పొటాషియం, భాస్వరం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


 

Image credits: Pinterest

జీర్ణ సమస్యలకు

తాటి బెల్లంలో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కదలికలు సజావుగా సాగేందుకు తోడ్పడుతుంది. భోజనం చేసిన వెంటనే ఒక ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. 

Image credits: Facebook

చర్మ ఆరోగ్యం

చర్మానికి కూడా తాటిబెల్లం ఎంతో తోడ్పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Image credits: our own

నల్ల నువ్వులు, నల్ల బియ్యం, నల్ల ఆవాలను తింటే ఏమౌతుందో తెలుసా

రాత్రి ఈ పండ్లను తింటున్నారా? ఆరోగ్యం ప్రమాదంలో పడుతున్నట్లే

చలకాలంలో జుట్టుకు హెన్నా ఎలా పెట్టాలో తెలుసా?

చాణక్య నీతి: వీటిని దూరం చేస్తేనే మీకు సక్సెస్ దక్కుతుంది