నల్ల నువ్వులు, నల్ల బియ్యం, నల్ల ఆవాలను తింటే ఏమౌతుందో తెలుసా
చియా గింజలు
నల్లగా ఉండే చియా విత్తనాలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టితింటే బరువు తగ్గుతారు. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. వాపు తగ్గుతుంది.
నల్ల నువ్వులు
నల్లనువ్వులు పోషకాల గని. వీటిలో జింక్, కాల్షియంతో పాటుగా ఎన్నో పోషకాలుంటాయి. వీటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కలోంజి
కలోంజీలో ఉండే థైమోక్వినోన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. కలోంజి వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
ఆవాలు
ఆవాలను తింటే జీర్ణ ఎంజైమ్లు పెరుగుతాయి. మలబద్దకం తగ్గుతుంది. దీనిలోని వేడి స్వభావం దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలగిస్తుంది. అంతేకాదు ఇది కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.
నల్ల బియ్యం
నల్లబియ్యంలో ఉండే ఆంథోసైనిన్ వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. అలాగే దీనిలో వైట్ రైస్ లో కంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే బరువు తగ్గుతారు. హైబీపీ తగ్గుతుంది.
నల్ల సోయాబీన్
నల్ల సోయాబీన్ తింటే కండరాలు పెరుగుతాయి. అలాగే ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే ఆడవారికి ఇవి మెనోపాజ్ టైంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.