Woman
చలికాలంలో ఎక్కువ మంది జలుబు, దగ్గు భయంతో జుట్టుకు హెన్నా పెట్టుకోరు. కానీ, దీని వల్ల జుట్టు మొత్తం తెల్లగా కనపడుతూ ఉంటుంది. దానిని కవర్ చేయాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే.
మీ తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతుంటే, ఈ కాలంలో కూడా మీరు సులభంగా మెహందీ వేసుకోవడానికి 5 చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
మెహందీ పెట్టిన తర్వాత ఎండలో కూర్చోండి. దీంతో చలిగా అనిపించదు. 45 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి. ఎక్కువసేపు మెహందీ పెట్టుకోకండి.
రాత్రిపూట కొద్దిగా నీటిలో మెహందీ నానబెట్టండి. వేసుకునే ముందు వేడినీటితో కలిపి వేసుకోండి. దీంతో తలకు వెచ్చదనం లభిస్తుంది.
మెహందీ వేసుకున్న తర్వాత రూమ్ హీటర్ పెట్టుకుని కూర్చోవచ్చు. దీంతో మెహందీ ఆరిపోతుంది, చలి కూడా వేయదు.
కొబ్బరి నూనె జుట్టుకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మెహందీ పౌడర్‌లో కొబ్బరి నూనె కలపండి. కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించండి.
టీ, కాఫీలు జుట్టుకు సహజ రంగును ఇస్తాయి, చలి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి. టీ లేదా కాఫీ నీటిలో మెహందీ కలిపి జుట్టుకు పట్టించండి.