Lifestyle

పోషకాలు పుష్కలంగా ఉంటాయి

పచ్చి బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియంతో సహా మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 
 

Image credits: Getty

జీర్ణ ఆరోగ్యం

పచ్చి బొప్పాయిలో పాపైన్ వంటి ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

శోథ నిరోధక లక్షణాలు

బొప్పాయిలో ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్ వంటి ఎన్నో బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
 

Image credits: Getty

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

పచ్చి బొప్పాయిలో ఉండే విటమిన్ సి కంటెంట్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది అంటువ్యాధులు, ఇతర అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది. 
 

Image credits: Getty

వెయిట్ లాస్

పచ్చి బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు.. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఇ  ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది.
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

పచ్చి బొప్పాయిలో ఉండే  పీచు పదార్థం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Find Next One