Lifestyle
పచ్చి పసుపు తినడం వల్ల శరీరంలో వాపు తగ్గుతుంది. ఇది ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధుల వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల లక్షణాలను తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.
కర్కుమిన్ కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మన శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడానికి సహాయపడుతుంది. పచ్చి పసుపు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది.
పచ్చి పసుపు మన పిత్తాశయంలో పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ పసుపు కొవ్వు విచ్ఛిన్నతను కూడా ప్రోత్సహిస్తుంది.
పచ్చి పసుపులోని క్రియాశీల సమ్మేళనాలు రోగనిరోధక వ్యస్థను బలోపేతం చేస్తాయి. ఇది ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యల నుంచి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం.. పచ్చి పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదల, వ్యాప్తిని నిరోధించే క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.
కుర్కుమిన్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన బీటా-అమిలాయిడ్ ఫలకాలు చేరడాన్ని తగ్గించి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
పచ్చి పసుపు రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో మీకు గుండెజబ్బులొచ్చే ముప్పు తగ్గుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.