Lifestyle
వ్యాయామం తర్వాత ఖచ్చితంగా తినాల్సిన ఆహారం ఉడకబెట్టిన గుడ్లు. అవును ఉడకబెట్టిన గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డు మనకు ఎనర్జీని అందిస్తాయి. శరీరాన్ని బలంగా చేస్తుంది.
పనీర్ తో మనం ఎన్నో రకాల వంటలను వండుకుని తింటుంటాం. అయితే వ్యాయామం తర్వాత వంట చేయకుండా పనీర్ తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం చేసిన తర్వాత చికెన్ తినాలనుకునే వారు గ్రిల్డ్ చికెన్ ను ఎంచక్కా తినొచ్చు. కానీ దీనిని మరీ ఓవర్ గా తినకూడదు. నిజానికి గ్రిల్డ్ చికెన్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది.
సోయా మంచి పోషకాల బాంఢాగారం. వ్యాయామం తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయాతో బుర్జీని తయారు చేసి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పీనట్ బటర్ టోస్ట్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు వ్యాయామం తర్వాత బ్రెడ్, వేరుశెనగ వెన్నతో టోస్ట్ తయారు చేసి లాగించొచ్చు. ఇది కూడా మీకు ఎనర్జీని ఇస్తుంది. పోషకాలను అందిస్తుంది.