Lifestyle
పెరుగులో కాల్షియం, లాక్టిక్ యాసిడ్ వంటి ప్రోబయోటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి పెరుగును తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు కూడా మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఈ పండ్లు మన చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆకు కూరల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరలను తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే అల్లం వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి మొదలైన వాటిని నివారించడంలో సహాయపడుతుంది. అలాగే శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న వెల్లుల్లి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాల కూడా ఉంటాయి. ఇది జలుబును తొందరగా తగ్గించడానికి సహాయపడుతుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా పసుపును తీసుకోవచ్చు.