Lifestyle

కలబంద

కలబందలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. కలబంద జెల్ కూడా డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది. ఇందుకోసం కలబంద జెల్ ను తీసుకుని కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత కడిగేయండి.
 

Image credits: Getty

కీరదోసకాయ

కీరదోసకాయ మన శరీరాన్ని చల్లగా ఉంచడమే కాదు.. ఎన్నో చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. చల్లని దోసకాయను వృత్తాకారంలో కట్ చేసి మీ కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. 
 

Image credits: Getty

పసుపు

పసుపు మన చర్మానికి చేసే మేలు ఎంతో. టీ స్పూన్ పసుపులో కొన్ని చుక్కల పైనాపిల్ రసం కలిపి కళ్ల కింద అప్లై చేసి 10-15 నిముషాలు అలాగే వదిలేయండి.
 

Image credits: Getty

రోజ్ వాటర్

రోజ్ వాటర్ కూడా డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. ఇందుకోసం చల్లని రోజ్ వాటర్ లో ముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని  10-15 నిమిషాల పాటు ఉంచండి.
 

Image credits: Getty

బాదం నూనె

బాదం నూనె చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల బాదం నూనె తీసుకుని కళ్ల చుట్టూ పెట్టి కొద్దిసేపు మసాజ్ చేయండి. ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ పోతాయి.
 

Image credits: Getty

మెంతులు

రాత్రిపూట నానబెట్టిన ఒక చెంచా మెంతులను పొద్దున్నే గ్రైండ్ చేసి 10-15 నిమిషాల పాటు కళ్ల కింద అప్లై చేయండి. దీంతో కళ్ల చుట్టూ నల్ల మచ్చలు పోతాయి.

Image credits: Getty

పుదీనా ఆకులు

పుదీనా ఆకులు కూడా డార్క్ సర్కిల్స్ ను పోగొడుతాయి. ఇందుకోసం పుదీనా ఆకులను  గ్రైండ్ చేసి దాని రసం తీసి కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాలు అలాగే వదిలేయాలి.
 

Image credits: Getty
Find Next One