Lifestyle

నీతా అంబానీ, ముకేష్ అంబానీ మొదటిసారి ఎలా కలుసుకున్నారో తెలుసా?

నీతా పుట్టిన రోజు

ముకేష్ అంబానీ భార్య నీతా నేడు అంటే నవంబర్1వ తేదీన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ముకేష్ ని తొలిసారి ఎలా కలుసుకున్నారో చూద్దాం

 

అంబానీ కుటుంబం నీతా రియాక్షన్

20ఏళ్ల వయసులో నీతా భరతనాట్యం కోసం ముంబయిలోని బిర్లా మాతృశ్రీక వెళ్లారు. అక్కడ ధీరూభాయ్-కోకిలాబెన్ లు ఆమెను చూశారు. వెంటనే నీతా ఇంటికి ఫోన్ చేసి కలవమన్నారట.

 

 

ధీరూభాయ్ అంబానీని కలిసిన నీతా

నీతా తన తండ్రితో కలిసి ధీరూభాయ్ అంబానీ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడ ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత ధీరూభాయ్ ఆమెను కొడుకు ముఖేష్‌ని కలవమని ఒప్పించారు.

నీతా, ముఖేష్ అంబానీల మొదటి కలయిక

నీతా తండ్రి రవీంద్రభాయ్ దలాల్ ముఖేష్ అంబానీని కలవడానికి అంగీకరించి, కూతుర్ని తీసుకొని 'ఉషా కిరణ్'కి వెళ్లారు, అక్కడే ముఖేష్ ఉండేవారు. ఈ సంఘటనను నీతా అంబానీ స్వయంగా ఒకసారి చెప్పారు.

నీతా ముందు ముఖేష్ ఎలా కనిపించారు?

ముఖేష్ ఇంటికి చేరుకుని, నీతా, ఆమె తండ్రి డోర్‌బెల్ కొట్టారు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు వేసుకున్న ముఖేష్ అంబానీ తలుపు తెరిచారు. ఆయన నీతా వైపు చేయి చాపి, 'నేను ముఖేష్' అన్నారు.

నీతా-ముఖేష్ స్నేహం

నీతా ఒక ఇంటర్వ్యూలో, 'ఇంత పెద్ద వ్యక్తి నా ముందు నిలబడి ఉండటం నమ్మలేకపోయాను' అని చెప్పారు. ఆ తర్వాత వారిద్దరి కలయికలు కొనసాగాయి, 6-7 సార్లు కలిసిన తర్వాత ఇద్దరూ కుదుటపడ్డారు.

నీతా-ముఖేష్ కలయిక ప్రేమగా మారింది

ఒకసారి నీతా, ముఖేష్ ముంబైలోని పెడర్ రోడ్డు నుంచి కారులో వెళ్తున్నారు, సాయంత్రం వేళ, ఒక సిగ్నల్ దగ్గర కారు ఆగింది, అప్పుడు ముఖేష్ సినిమా స్టైల్లో నీతాకు పెళ్లి ప్రపోజ్ చేశారు.

నీతా ముఖేష్ ప్రపోజల్‌కి ఒప్పుకుంది

ముఖేష్ 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని అడిగారు. నీతా సిగ్గుతో తల దించుకుంది. ముఖేష్ 'సరే అన్నంత వరకూ కారు ముందుకు వెళ్లదు' అన్నారు. దాంతో నీతా సరే అని చెప్పింది.

ముఖేష్ అంబానీతో నీతా ఇంప్రెస్ అయ్యారు

నీతా ముఖేష్‌తో 'నిజంగా నన్ను ప్రేమిస్తే, నాతో కారులో కాదు, బస్సులో రండి' అని అన్నారు. ముఖేష్  అంగీకరించి,  బస్సులో జుహు బీచ్‌కి వెళ్లారు. ముఖేష్ చేసిన దానికి నీతా ఇంప్రెస్ అయ్యారు.

ఏం తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసా

ఈ చీరలు కట్టుకుంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొడుగ్గా కనిపిస్తారు

రాత్రిపూట ఈ పండ్లను అస్సలు తినకూడదు

బ్రేకప్ బాధిస్తోందా? ఇలా చేస్తే మీరు రీఫ్రెష్ అవుతారు