Health

ఏం తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసా

Image credits: Getty

చెడు కొలెస్ట్రాల్

ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం తినే ఆహారమే ఇది పెరగడానికి అసలు కారణం. 

Image credits: Getty

ఆహారాలు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు శరీరంలో చాలా త్వరగా కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అవేంటంటే? 

Image credits: Getty

కుకీలు, పేస్ట్రీలు, కేక్‌లు

కేక్ లు, కుకీలు, పేస్ట్రీలు టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వీటినితింటే ఒంట్లో కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. 

Image credits: Freepik

ఎర్ర మాంసం

చాలా మంది రెడ్ మీట్ ను చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ రెడ్ మీట్ లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు బాగా పెరగడానికి దారితీస్తుంది. 

Image credits: Getty

పాల ఉత్పత్తులు

వెన్న,  చీజ్, పన్నీర్ వంటి పాల ఉత్పత్తుల్లో కూడా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్నా మీ ఒంట్లో కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. 

Image credits: FREEPIK

నూనె పదార్థాలు

నూనెలో వేయించిన ఆహారాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి. వీటిని ఎక్కువగా తింటే మీరు బరువు పెరగడమే కాదు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. 

Image credits: Getty

పామాయిల్

పామాయిల్‌ లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే కూడా ఒంట్లో కొవ్వు బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

ఫాస్ట్ ఫుడ్

ఫాస్ట్ ఫుడ్ ను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ దీనిలో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు బాగా పెరిగేలా చేస్తాయి. 

Image credits: Getty

మిరియాలను తింటే ఏమౌతుందో తెలుసా

5 సెకన్లలోనే లంగ్ క్యాన్సర్ టెస్ట్.. మీరే చేసుకోవచ్చు

బీట్ రూట్ ను తింటే ఏమౌతుందో తెలుసా

సబ్జా నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా