Woman

ఈ చీరలు కట్టుకుంటే పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొడుగ్గా కనిపిస్తారు

కిర్తి సురేష్ చీర డిజైన్లు

పొట్టిగా ఉండే అమ్మాయిలకు కీర్తి సురేష్ కట్టుకన్న చీరలు బాగా సరిపోతాయి. కాటన్, వర్క్,  టిష్యూ సిల్క్, డోలా సిల్క్, సీక్వెన్స్ చీరల్లో మీరు పొడుగ్గా, సన్నగా కనిపిస్తారు. 

థ్రెడ్ వర్క్ చీర

షిఫాన్ చీరలో థ్రెడ్ వర్క్ చీర పొట్టిగా ఉన్న అమ్మాయిలకు బాగుంటుంది. ఈ చీర మీరు సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది.అంతేకాదు ఈ చీరల్లో మీ లుక్ అదిరిపోతుంది. 

కాటన్ చీర

కాటన్ చీరలను ఎవ్వరైనా కట్టుకోవచ్చు. ఎలాంటి సందర్భాలకైనా కట్టుకోవచ్చు. మంచి రంగు, డిజైన్ ఉంటే సింపుల్ లుక్ లో కూడా మీరు క్లాసీగా కనిపిస్తారు.

గోల్డెన్ టిష్యూ చీర

గోల్డెన్ టిష్యూ చీర ఎంత బాగుంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవే ట్రెండ్ లో ఉన్నాయి. పొట్టిగా ఉండే అమ్మాయిలు డీప్ నెక్ బ్లౌజ్‌తో ఈ చీరను కట్టుకుంటే బాగుంటారు.

డోలా సిల్క్ చీర

అన్ని సందర్భాలకు డోలా సిల్క్ చీరలు బాగా నప్పుతాయి. వీటిలో మీరు మరింత అందంగా కనిపిస్తారు. మంచి డిజైన్లు, రంగు చీర కట్టుకుంటే మీ అందం అమాంతం పెరుగుతుంది. 

సీక్వెన్స్ చీర

సీక్వెన్ చీరలు పార్టీలకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి.వెస్ట్రన్ డ్రెస్సుల మధ్య ట్రెడిషనల్, మోడ్రన్ లుక్ కావాలంటే  మీరు ఈ సీక్వెన్స్ చీర కట్టుకోవచ్చు.

నయనతార అదిరిపోయే జ్యూవెలరీ కలెక్షన్

వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలా?

అందాన్ని పెంచే డ్రై ఫ్రూట్ ఇది

మోచేతుల నలుపు పోవాలంటే ఏం చేయాలి?