Food
సిట్రస్ పండ్లు, అరటిపండ్లను రాత్రిపూట అస్సలు తినకూడదు.అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ..వీటిలో ఉండే సహజ చక్కెరలు, పిండి పదార్థాలు బ్లడ్ షుగర్ ను పెంచుతాయి.
మామిడి పండ్లను కూడా రాత్రిపూట అస్సలు తినకూడదు.ఎందుకంటే మామిడి పండ్లలో ఉండే చక్కెర మీకు రాత్రి నిద్రపట్టకుండా చేయడమే కాకుండా..బ్లడ్ షుగర్ పెరుగుతుంది.
ద్రాక్షలు తీయగా ఉంటాయి. కానీ వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే నేచురల్ షుగర్స్ రక్తంలో చక్కెరను పెంచి మీకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి.
పైనాపిల్ లో ఆమ్ల లక్షణాలు ఉంటాయి. వీటిని రాత్రిపూట తింటే తిన్నది అరగకపోవడం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల మీకు నిద్ర ఉండదు.
చెర్రీ పండ్లలో మెలటోనిన్ ఉన్నప్పటికీ.. వీటిని ఎక్కువగా తింటే మాత్రం బ్లడ్ షుగర్ పెరగడమే కాకుండా.. మీ జీర్ణఖ్రియ మీద కూడా ప్రభావం పడుతుంది.
పుచ్చకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా ఈ పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని రాత్రిపూట తింటే మీరు రాత్రిళ్లు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
ఆపిల్ పండు మన ఆరోగ్యానికి ఎంత మంచిదైనా దీన్ని రాత్రిపూట ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
ఆపిల్ లాగే, పియర్స్ ను తింటే కూడా రాత్రిపూట జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే అసౌకర్యంగా ఉంటుంది.