రాత్రుళ్లు సహజంగా జీర్ణ వ్యవస్థ క్రీయాశీలకంగా ఉండదు. పరాటలో కార్బోహైడ్రేట్లు ఉండడంతో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కడుపుబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకు దారి తీస్తుంది.
Image credits: our own
నిద్రలేమి
రాత్రుళ్లు పరాట తింటే నిద్రలేమి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరాట తింటే కడుపు సమస్యల వల్ల నిద్ర తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెంచి నిద్రను దెబ్బతీస్తుంది.
Image credits: adobe stock
కడుపు సమస్య
కడుపు సంబంధిత సమస్యలకు కూడా పరాట కారణమవుతుంది. కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
Image credits: our own
బరువు పెరగడం
పరాటలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే పరాటను రాత్రుళ్లు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: our own
గుండెపోటు
రాత్రి పడుకునే ముందు పరాట తింటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండెపోటు సంబంధిత సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: our own
శారీరక శ్రమ తక్కువ
రాత్రుళ్లు సహజంగానే శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. దీంతో పరాట జీర్ణంకావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు పరాటను మధ్యాహ్నమే తీసుకోవాలి.
Image credits: Freepik
గోధుమ పిండితో చేసిన..
అయితే పరాటకు బదులుగా రాత్రుళ్లు వీలైనంత వరకు గోధుమ చపాతీని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.