ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకొస్తుంది: ఇదే కారణం

Spiritual

ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకొస్తుంది: ఇదే కారణం

వారాల క్రమం ఇలా..

తెలుగు వారాల పేర్లు సంస్కృత భాష నుంచి తీసుకున్నవి. అయితే అసలు ఏడు వారాలకు ఈ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. 

 

అథర్వణ వేదంలోని శ్లోకం

వాస్తవానికి వారంలోని ఈ క్రమం మన వేదాల్లో రాసి ఉంది. అథర్వణ వేదంలోని ఒక శ్లోకం ప్రకారం ‘ఆదిత్యః సోమో భౌమశ్చ తథా బుధ బృహస్పతిః। భార్గవః శనైశ్చరశ్చైవ ఏతే సప్త దినాధిపాః।।’

వారంలోని రోజులను ఇలా నిర్ణయించారు

అథర్వణ వేదంలోని ఈ శ్లోకం ప్రకారం ఆదిత్య అంటే సూర్యుడు, దాని నుండి ఆదివారం వచ్చింది. ఆ తర్వాత సోమవారం, మంగళవారం, భార్గవ అంటే శుక్రవారం ఇలా ప్రతి పదం ఒక వారాన్ని తెలుపుతుంది. 

హోర ద్వారా వారం పేరు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 24 గంటలకు 24 హోరలు ఉంటాయి. ప్రతి హోరపై ఒక గ్రహం ప్రత్యేక ప్రభావం ఉంటుంది. ప్రతి రోజు మొదటి హోర ఏ దేవుడి పేరు ఉంటుందో అది ఆ వారాన్ని చెబుతుంది. 

హోర ద్వారా శుభ ముహూర్తం

ఆదివారం మొదటి హోర సూర్యుడు, అదేవిధంగా సోమవారం చంద్రుడు, మంగళవారం మంగళుడు, బుధవారం బుధుడు ఇలా ఆ రోజు మొదటి హోరను గణించి పండితులు శుభముహూర్తాలు నిర్ణయిస్తారు. 

ఈ మంత్రంలోనూ వారాల క్రమం ఉంది

‘ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:’ నవగ్రహ శాంతి మంత్రమైన ఈ వాక్యంలో ఏడు వారాల పేర్లు ఉంటాయి. 

 

చాణక్య నీతి: ఈ 4 పనులను మధ్యలో వదిలేయకూడదు

ఒక్క రాత్రిలో దయ్యాలు నిర్మించిన ఆలయం ఇది: ఎక్కడుందో తెలుసా

భీష్ముడిని మరణించమని ఆయన తండ్రే వరమిచ్చాడు. ఎందుకో తెలుసా?

భీష్ముడికి ఆయన తండ్రి మరణించమని వరం ఇచ్చాడు: ఎందుకంటే..