Lifestyle
UPSC ఇంటర్వ్యూ అంత కష్టం కాదు. ఒక్కో అభ్యర్థిని 20 నుంచి 25 నిమిషాలు ప్రశ్నిస్తారు. ఆ సమయం అంతటా ఆత్మవిశ్వాసంతో ఉండండి.
ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించాలంటే అభ్యర్థులు తమ సబ్జెక్టుల గురించి పూర్తిగా తెలుసుకొని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పాలి.
ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానం చెప్పండి. తొందరపడకండి. ఎందుకంటే అది తప్పులకు దారితీస్తుంది. శ్రద్ధగా విని, ఆలోచించి సమాధానం చెప్పండి.
ఇంటర్వ్యూ ప్రశ్నలు తరచుగా అభ్యర్థి నైతిక ఆలోచనను అంచనా వేస్తాయి. మీ ఆలోచనలను, ప్రణాళికలను స్పష్టంగా తెలపండి.
ఎక్కువగా మాక్ టెస్ట్‌లు రాయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీ స్వస్థలం, అభిరుచులు, వ్యక్తిగత వివరాలు, విద్య, అనుభవాల గురించి ముందుగానే సమాచారం సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ప్యానెల్ అడగవచ్చు. తప్పులు చెప్పొద్దు.
ఎప్పుడూ కచ్చితమైన, సంక్షిప్త సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. ప్యానెల్‌ను ఆకట్టుకోవడానికి స్మార్ట్ గా స్పందిస్తూ సమాధానాలు చెప్పండి.
అభ్యర్థి కచ్చితంగా ఓపిక, సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే విజ్ఞానంతో పాటు సహనం చాలా అవసరం.