Food

జీర్ణ ఆరోగ్యం

జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడానికి ఖర్జూరాలు ఎంతగానో సహాయపడతాయి. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఇందుకు సహాయపడుతుంది. 
 

Image credits: Getty

యాంటీ ఆక్సిడెంట్స్

ఖర్జూరాలు యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన భాండాగారం. ఇది ఎన్నో వ్యాధులు, ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి, రాకుండా చేసేందుకు సహాయపడుతుంది. 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

ఖర్జూరాల్లో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. వీటిని తింటే మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

గుండెకు మేలు చేసే పొటాషియం ఖర్జూరాల్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

Image credits: Getty

ఇనుము

ఖర్జూరాలు ఇనుముకు మంచి వనరులు. అందుకే  హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారందరికీ ఖర్జూరాలను తినొచ్చు. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

శక్తి

ఖర్జూరాలు కూడా మనకు సహజమైన శక్తి వనరే.  వీటిని తింటే మీరు రోజంతా శక్తివంతంగా ఉంటారు. వీటిలోని పోషకాలు మనకు బలాన్నిస్తాయి. 
 

Image credits: Getty

మెదడు ఆరోగ్యం

ఖర్జూరాల్లో విటమిన్ బి6, కోలిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు మన మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూరాలను తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 

Image credits: Getty

ఆస్తమా పేషెంట్లు తినాల్సిన ఆహారాలు

ఈ కూరగాయలు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తయ్

దాల్చిన చెక్కతో ఇన్ని లాభాలా?

బరువు తగ్గడానికి వీటిని తింటే సరిపోతుందిగా..