Lifestyle
పింక్ జామకాయల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఈ జామకాయలను రెగ్యులర్ గా తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
పింక్ కలర్ జామకాయలను తింటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే జామకాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగానే ఉంటుంది.
జామకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి పింక్ జామపండును రెగ్యులర్ గా తింటే మీ రోగనిరోధక శక్తి పెరిగి.. మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు.
చలికాలంలో జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి ఎన్నో సమస్యలను దూరం చేయడంలో పింక్ జామకాయ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
పింక్ జామకాయలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పింక్ జామకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. దీని పనితీరు మెరుగుపడుతుంది.
పింక్ జామకాయల్లో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే అతిగా తినకుండా చేస్తుంది. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది.
ఈ జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. ఇది చర్మంపై ముడతలను నివారించడానికి సహాయపడుతుంది.