మొదటి రోజు శైలపుత్రీ దేవిని పూజిస్తారు. ఈ రోజు ఆరెంజ్ రంగు చీర కట్టుకోవాలి. పింక్ బార్డర్ ఉన్న ఈ ఆరెంజ్ చీరలో మీ లుక్ అదిరిపోతుంది.
Image credits: Instagram
Telugu
రెండో రోజు తెలుపు
రెండో రోజు బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తారు. ఈ రోజు తెలుపు రంగు చీర ధరించాలి. బార్డర్, కొంగుపై ఫ్లోరల్ వర్క్ ఉన్న ఈ వైట్ చీరలో అనుపమ చాలా అందంగా ఉంది.
Image credits: Instagram
Telugu
మూడోరోజు ఎరుపు..
మూడో రోజు చంద్రఘంటా దేవిని పూజిస్తారు. ఈ రోజు ఎరుపు రంగు చీర కట్టుకోవాలి. జరీ వర్క్ ఉన్న ఈ లైట్ వెయిట్ రెడ్ చీర పండుగ కళను మరింత పెంచుతుంది.
Image credits: Instagram
Telugu
నాలుగో రోజు బ్లూ..
నాలుగో రోజు కూష్మాండ దేవిని ఆరాధిస్తారు. ఈ రోజు నీలం రంగు చీర ధరించాలి. పెద్ద బార్డర్ ఉన్న బ్లూ చీర, ఫుల్ స్లీవ్ బ్లౌజ్ మీకు రిచ్ లుక్ ఇస్తాయి.
Image credits: Instagram
Telugu
ఐదో రోజు పసుపు
ఐదో రోజు స్కందమాతను పూజిస్తారు. ఈ రోజు పసుపు రంగు చీర కట్టుకోవాలి. పింక్ బార్డర్ ఉన్న ఈ ఎల్లో చీరలో అనుపమ గౌడ వింటేజ్ లుక్ లో ఆకట్టుకుంటోంది.
Image credits: Instagram
Telugu
ఆరో రోజు గ్రీన్..
ఆరో రోజు కాత్యాయనీ దేవిని ఆరాధిస్తారు. ఈ రోజు ఆకుపచ్చ రంగు చీర ధరించాలి. డార్క్ గ్రీన్ కొంగు ఉన్న ఈ లైట్ గ్రీన్ మైసూర్ క్రేప్ చీర చాలా అందంగా ఉంటుంది.
Image credits: Instagram
Telugu
ఏడో రోజు బూడిద రంగు..
ఏడో రోజు కాళరాత్రి దేవిని పూజిస్తారు. ఈ రోజు బూడిద రంగు దుస్తులు వేసుకోవాలి. చీరకు బదులుగా అనుపమలా ఇలా గ్రే, బ్లాక్ కాంబినేషన్ లో లంగా ఓణీ ట్రై చేయండి.
Image credits: Instagram
Telugu
ఎనిమిదో రోజు ఊదారంగు
ఎనిమిదో రోజు మహాగౌరిని ఆరాధిస్తారు. ఈ రోజు పర్పుల్ (ఊదా) రంగు చీర కట్టుకోవాలి. సిల్వర్ బార్డర్ ఉన్న ఈ కాటన్ సిల్క్ చీర పండుగ పూట చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
Image credits: Instagram
Telugu
తొమ్మిదో రోజు గ్రీన్ కలర్..
నవరాత్రి చివరి రోజు సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. ఈ రోజు పీకాక్ గ్రీన్ రంగు చీర ధరించాలి. అనుపమ కట్టుకున్న ఈ చీర పండుగ సంబరాన్ని రెట్టింపు చేస్తుంది.