కడుపంతా ఉబ్బరంగా ఉంటుందా? ఇలా చేస్తే వెంటనే రిజల్ట్
life Dec 20 2024
Author: Narender Vaitla Image Credits:Freepik
Telugu
మజ్జిగ
గ్యాస్ సమస్యకు ఇట్టే పరిష్కారం కల్పించడంలో మజ్జిగ ఉపయోగపడుతుంది. మజ్జిగలో కొత్తిమీర వేసుకొని తాగితే కడుపులో గ్యాస్ తగ్గి హాయిగా ఉంటుంది.
Image credits: our own
Telugu
లవంగం
భోజనం చేసిన వెంటనే నోటిలో ఒక లవంగం వేసుకొని చప్పరించాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య అనేది దరి చేరకుండా ఉంటుంది.
Image credits: social media
Telugu
జీలకర్ర
కడుపు సమస్యలను దూరం చేయడంలో జీలకర్ర కూడా బెస్ట్ ఆప్షన్. రాత్రంతా నీటిలో జీలకర్రను నానబెట్టి ఉదయాన్నే నీటిని తాగితే కడుపు సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.
Image credits: Getty
Telugu
అరటి పండు
జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో అరటి పండు ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక అరటి పండు తింటే ఎంతో మేలు జరుగుతుంది.
Image credits: Getty
Telugu
నిమ్మనీరు
రోజు ఉదయాన్నే పరగడుపున గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
Image credits: Getty
Telugu
పుదీనా
పుదీనాతో చేసిన టీ తాగితే కూడా కడుపు సమస్యలు దరిచేరవు. రోజు ఉదయాన్నే పుదీనా టీ తాగే కడుపు హాయిగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
గమనిక
ఈ వివరాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఒకవేళ కడుపు నొప్పి అధికంగా ఉంటే వైద్యులను నేరుగా సంప్రదించడమే ఉత్తమం.