Spiritual
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థిక వేత్త, వ్యూహకర్త. మనం జీవితంలో విజయం సాధించాలంటే ఆయన సిద్దాంతాలు ఫాలో అవ్వాలి.
చాణక్యుడి ప్రకారం.. మనకు సంబంధించిన కొన్ని విషయాలను పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదట. అవేంటో చూద్దాం..
మిమ్మల్ని నమ్మి మీకు ఎవరైనా ఏదైనా సీక్రెట్ పంచుకుంటే.. దానిని మీరు ఎప్పుడూ ఇతరులతో చెప్పకూడదు. మీరు సీక్రెట్ బయటపెడితే నమ్మకం కోల్పోతారు.
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి తన భవిష్యత్తు ప్రణాళికలను ఇతరులతో పంచుకోకూడదు. ప్లాన్ మీ కుటుంబం , సన్నిహిత వ్యక్తులతో మాత్రమే పంచుకోవాలి. ఇతరులు మిమ్మల్ని తప్పుదారి పట్టించగలరు.
చాణక్యుడు ప్రకారం, మనం మన ఆర్థిక పరిస్థితిని ఎవరితోనూ పంచుకోకూడదు. మన దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా మన ఆర్థిక వ్యవహారాలను ఇతరులతో పంచుకోవడం భావితరాలకు ప్రమాదకరం.
ఒక వ్యక్తి తన బలహీనతలను ఇతరులకు చెప్పకూడదని చాణక్యుడు చెప్పాడు. ఒకవేళ చెబితే అది మీకు ప్రమాదకరం. నీ బలహీనతను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో.