Food

15 నిమిషాల్లో నూనె లేకుండా ఉసిరికాయ పచ్చడిని ఇలా ఈజీగా పెట్టండి

ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు

  • ఉసిరికాయలు 
  • పసుపు
  • ఉప్పు
  • నల్లరాతి ఉప్పు 
  • జీలకర్ర పొడి 
  • నీళ్లు

ఉసిరికాయ పచ్చడి

ఉసిరికాయ పచ్చడి కోసం ఉసిరికాయల్ని కడిగి నీళ్లలో వేసి అందులో పసుపు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉడికించండి. దీనివల్ల చేదు తగ్గుతుంది. 

ఉసిరికాయ పచ్చడి

ఉడికిన ఉసిరికాయలు చల్లారిన తర్వాత వాటి గింజల్ని తీసేయండి. 

ఉసిరికాయ పచ్చడి

ఇప్పుడు జీలకర్ర పొడిని, ఉప్పును ఉసిరికాయ ముక్కల్లో వేసి కలపండి. దీంతో ఉసిరికాయ పచ్చడి టేస్టీగా అవుతుంది. మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీనిలో సెలేరీ, మెంతుల పొడినీ కలపొచ్చు. 

ఎండలో పెట్టాలి

ఈ ఉసిరికాయ పచ్చడిని 2-3 రోజుల పాటు ఎండలో పెట్టాలి. అలాగే మర్చిపోకుండా రోజుకు ఒకసారి కలుపుతూ ఉండాలి. 

గాజు సీసాలో నిల్వ చేయాలి

ఈ పచ్చడిని గాజు సీసాలో నిల్వ చేయాలి. దీనిని మీరు ఫ్రిజ్ లో పెట్టి 2-3 నెలల వరకు తినొచ్చు. నూనె లేకపోవడంతో బయట పెడితే ఇది పాడైపోతుంది.

బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తినాల్సినవి ఇవే

డయాబెటీస్ ఉన్నవారు అంజీర పండ్లను తింటే ఏమౌతుంది?

బెండకాయ ఎవరు తినకూడదు..?

రోజుకో గుడ్డు తినమని ఎందుకు చెప్తారో తెలుసా?