నిద్రలో చెమటలు పడుతున్నాయా? అలర్ట్ అవ్వకపోతే అంతే సంగతులు
life Dec 20 2024
Author: Narender Vaitla Image Credits:Getty
Telugu
హైపర్ టెన్షన్
రాత్రుళ్లు అకారణంగా చెమటలు పడుతుంటే హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి. రక్తపోటు అధికంగా ఉన్న వారిలోనూ ఈ సమస్య వస్తుంది. కాబట్టి వెంటనే బీపీ చెక్ చేసుకోవాలి.
Image credits: pinterest
Telugu
ఒత్తిడి, ఆందోళన
ఏదో తెలియని ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతుంటే కూడా ఇలా చెమటలు పడుతుంటాయి. దీర్ఘకాలంలో ఇది తీవ్ర సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
Image credits: Getty
Telugu
ప్రమాదకర వ్యాధులు
హెచ్‌ఐవీ, టీబీ, లుకేమియా వంటి ప్రమాదకర సమస్యలతో బాధపడుతున్న వారిలో శరీంలో ఉన్నపలంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది కూడా రాత్రుళ్లు చెమటలు పట్టడానికి కారణమవుతుంది.
Image credits: Getty
Telugu
హైపర్ థైరాయిడిజం
హైపర్ థైరాయిడిజం వల్ల శరీరం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఈ కారణంగా కూడా రాత్రుళ్లు చెమటలు ఎక్కువగా వస్తాయి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి.
Image credits: Getty
Telugu
మహిళల్లో
40 ఏళ్లు దాటిన మహిళల్లో ఈ సమస్య కనిపిస్తే వారు మనోపాజ్‌కు చేరువవుతున్నారని అర్థం చేసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి.
Image credits: Getty
Telugu
కెఫీన్
కెఫీన్ ఎక్కువగా పదార్థాలు తీసుకునే వారిలో కూడా రాత్రుళ్లు చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కెఫీన్‌కు దూరంగా ఉండాలి.
Image credits: Getty
Telugu
గమనిక
ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.