ఒకే రంగు జుంకాలు కాకుండా ఇలా రకరకాల రంగులున్నవి ఎంచుకోండి. ఇలాంటి జుంకాలలో రంగురంగుల రాళ్లను ఉపయోగిస్తారు.
పోల్కీలోని వేలాడే మువ్వలు చెవులకు మంచి గ్లో ఇస్తాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్‌కు ఇయర్‌చెయిన్ కూడా ఉంటుంది.
మీనాకారి వర్క్ వల్ల జుంకాలపై గులాబీ, ఆకుపచ్చ, నీలం, పసుపు వంటి అందమైన రంగులు కనిపిస్తాయి.
ఆక్సిడైజ్డ్ మల్టీనగ్ జుంకాలు తక్కువ ధరకే వస్తాయి. ఇవి చెవులకు మంచి స్టేట్‌మెంట్ లుక్ ఇస్తాయి. వీటికి మ్యాచింగ్‌గా గాజులు వేసుకుంటే బాగుంటుంది.
మల్టీకలర్ గూంగ్రు జుంకాలు గోల్డ్ ప్లేటెడ్‌తో వస్తాయి. వీటిలో రంగుల రాళ్లతో పాటు, రంగురంగుల గజ్జెలు దీనికి ఉంటాయి.
కుందన్ మల్టీస్టోన్ జుంకాలలో గజ్జెలతో పాటు రంగురంగుల కుందన్ వర్క్ కూడా కనిపిస్తుంది. ఇలాంటి జుంకాలు బెనారసీ చీరల వరకు దేనితోనైనా ట్రై చేయొచ్చు.
రంగురంగుల మూడు లేయర్ల జుంకాలు ఇవి. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
Sun Tan: ఎండకు ట్యాన్ అయ్యారా? ఇవి రాస్తే ట్యాన్ మొత్తం పోవాల్సిందే
Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు
Bentex Bangles: బంగారానికి ఏ మాత్రం తీసిపోని బెంటెక్స్ గాజులు
Face Glow: వేడి నీళ్లా? చల్లటి నీళ్లా? చర్మ సౌందర్యానికి ఏది మంచిది?