Lifestyle

ముఖేష్ అంబానీ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏం తింటారో తెలుసా

Image credits: instagram

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం పదండి. 

15 కిలోల బరువు తగ్గారు

ముఖేష్ అంబానీ ఒక్క వ్యాపారానికే కాదు తన శరీరానికి కూడా ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ముఖేష్ అంబానీ కొన్ని నెలల కిందట ఎలాంటి వ్యాయామం చేయకుండానే 15 కిలోల బరువు తగ్గారు. 

బరువు తగ్గడానికి ఆహారం

ముఖేష్ అంబానీ బరువు తగ్గడానికి ఎలాంటి వ్యాయామం చేయలేదు. కానీ కఠినమైన ఆహారాన్ని మాత్రం అనుసరించారు. ఇదే ఆయన బరువు తగ్గడమే కాకుండా.. హెల్తీగా ఉంచింది.

యోగా

ముఖేష్ అంబానీ ప్రతిరోజూ యోగా-ధ్యానంతో డేను స్టార్ట్ చేస్తారు. ఈయన ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి యోగా, ధ్యానం, సూర్య నమస్కారాలు చేస్తారట. 

ముఖేష్ అంబానీ బ్రేక్ ఫాస్ట్

ముఖేష్ అంబానీ బ్రేక్ ఫాస్ట్ లో దక్షిణ భారత వంటకాలను ఇష్టంగా తింటారట. బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, సాంబార్‌తో పాటుగా పండ్ల రసాలను తీసుకుంటారట. 

ముఖేష్ అంబానీ మధ్యాహ్న భోజనం

ముఖేష్ అంబానీ మధ్యాహ్నం ఇంట్లో వండిన ఫుడ్ నే తింటారు. గుజరాతీ కూర, పప్పు, బియ్యం, రాజ్మా, చపాతీ ని ఇష్టంగా తింటారు. 

ముఖేష్ అంబానీ రాత్రి భోజనం

ముఖేష్ అంబానీ రాత్రి భోజనంలో గుజరాతీ శైలిలో తయారుచేసిన పప్పును ఖచ్చితంగా తింటారట. దీనితో పాటుగా  కూరగాయలు, బియ్యం, సూప్, సలాడ్‌లను కూడా ఇష్టంగా తింటారు. 

జంక్ ఫుడ్

అంబానీ జంక్ ఫుడ్ ను అస్సలు తినరు. కానీ అప్పుడప్పుడు స్ట్రీట్ ఫుడ్ ను తింటారట. పెరుగు బటర్ పూరి, బేల్ పూరి అంటే ఆయనకు ఇష్టమట.

ఇష్టమైన స్నాక్స్

ముఖేష్ అంబానీకి సేవ్ పూరి అంటే చాలా ఇష్టమట. ఈయన ఈఎక్కువగా టీతో పాటుగా తేలికపాటి స్నాక్‌గా దీన్ని తినడానికి ఇష్టపడతారు.

ముఖేష్ అంబానీ గుజరాతీ భోజనం

ముఖేష్ అంబానీ అన్ని రకాల గుజరాతీ వంటకాలను ఇష్టంగా తింటారు.  వీటిలో ఫాఫ్డా, భాక్రీ, కాఖ్రా, ధోక్లా ఉన్నాయి.

మసాలా దినుసులకు పురుగులు పట్టొద్దంటే ఏం చేయాలో తెలుసా

ఎముకలను ఐరన్ వలె ధృడంగా మార్చే 7 రకాల ఫుడ్స్

పాల మీద మీగడ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి?

నకిలీ వెల్లుల్లి గుర్తించేదెలా..?